పగలు రాజీనామాలు చేసి..సాయంత్రం పీఎంఓలో టీ తాగితే ప్రత్యేకహోదా రాదు: కళా వెంకట్రావు

  • ఆరునూరైనా విభజన హామీలు నెరవేర్చాల్సిందే
  • మా ఎంపీలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
  • పార్లమెంట్ లో ప్రధాని మోదీ విఫలమయ్యారు
  • బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తోంది
పగలు రాజీనామాలు చేసి..సాయంత్రం పీఎంఓలో టీ తాగితే ప్రత్యేకహోదా రాదంటూ వైసీపీపై టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరునూరైనా విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని, ఏపీకి  ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగామని, తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమ ఎంపీలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, పార్లమెంట్ లో ప్రధాని మోదీ విఫలమైనందునే ఆయన ఇంటిని ముట్టడించామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తోంది కనుకనే వంద మంది ఎంపీలు తమతో కలిసి వచ్చారని, హోదా సాధించేందుకు ఎలాంటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Telugudesam
kala venkat rao

More Telugu News